Monday, April 28, 2025
HomeతెలంగాణRevanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నూతన సీఎస్‌ రామకృష్ణారావు

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నూతన సీఎస్‌ రామకృష్ణారావు

తెలంగాణ నూతన సీఎస్‌గా కె.రామకృష్ణారావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిని(CM Revanth Reddy)

- Advertisement -

ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఈనెల 30న పదవీ విరమణ చేయనున్న తరుణంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంది.1991 ఐఏఎస్ బ్యాచ్‌కి చెందిన రామకృష్ణారవు ప్రస్తుతం ఆర్థికశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. సీనియారిటీ జాబితాలో మరో ఆరుగురు అధికారులు పోటీలో ఉండగా.. వారి సమర్థత, అనుభవాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం రామకృష్ణారావు వైపు మొగ్గు చూపింది.

మరోవైపు సీఎస్‌గా పదవీ విమరణ చేయనున్న శాంతి కుమారికి కీలక బాధ్యతలు అప్పగించింది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వరనరుల అభివృద్ధి సంస్త వైస్ చైర్ పర్సన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News