సినీ నటులను ప్రేక్షకులు ఎంతగా ప్రేమిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా దక్షిణాది అభిమానులు అయితే వారిని దేవుళ్ల లాగా చూస్తారు. సినిమాలు రిలీజ్ అయితే భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు కట్టేస్తారు. అలాగే వారి పుట్టినరోజులు అయితే అన్నదానాలు, రక్తదానాలు చేస్తారు. కొందరు అభిమానులు అయితే హీరోయిన్లకు ఏకంగా గుడి కూడా కట్టేస్తారు. ఇలాంటివి ఘటనలు ఎక్కువగా తమిళనాడులో చూస్తూ ఉంటాం. తాజాగా ఈ పోకడ తెలుగు రాష్ట్రాలకూ పాకింది.
ఏపీలోని బాపట్ల జిల్లాకు చెందిన ఓ అభిమాని హీరోయిన్ సమంత(Samantha)కు ఏకంగా గుడి కట్టేశాడు. అంతేకాకుండా సమంత పుట్టిన రోజు సందర్భంగా ఆ గుడి వద్ద కేక్ కట్ చేయడంతో పాటు అన్నదానం కూడా చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో వైరల్ అవుతున్నాయి. కాగా సమంత ప్రస్తుతం నిర్మాతగా ‘శుభం’ అనే సినిమాను నిర్మించింది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.