ముంబై నటి కాదంబరి జెత్వానీ, ఆమె కుటుంబ సభ్యులను వేధించిన కేసులో ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు(PSR anjaneyulu) అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారం రాబట్టడం కోసం సీఐడీ అధికారులు ఆయనను కస్టడీకి తీసుకున్నారు. తాడిగడప సీఐడీ కార్యాయంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయనను విచారించారు. ఈ విచారణలో ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం ఆంజనేయులను విజయవాడ సబ్ జైలుకు తరలించారు. మరింత సమాచారం రాబట్టడం కోసం మరోసారి కస్టడీకి కోర్టులో పిటిషన్ వేయనున్నారు.
CID Custody: ముగిసిన పీఎస్ఆర్ ఆంజనేయులు సీఐడీ కస్టడీ విచారణ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES