డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri Jagannath) , తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) కాంబినేషన్‌లో పాన్ ఇండియా సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలో కన్నడ నటుడు దునియా విజయ్(Duniya Vijay) కీలక పాత్ర పోషించనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈమేరకు పూరి కనెక్ట్స్ అధికారికంగా పోస్ట్ చేసింది.
“కర్ణాటక నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల హృదయాల్లోకి.. శాండల్‌వుడ్ డైనమో, నటుడు విజయ్ కుమార్ (దునియా విజయ్) గారికి స్వాగతం. అందరినీ మంత్రముగ్ధుల్ని చేసే అద్భుతమైన పాత్రలో ఆయన కనిపించనున్నారు” అని పోస్టులో పేర్కొంది. ఈ ప్రాజెక్ట్‌లో సీనియర్ నటి టబు కూడా నటించనున్నారు. ఇప్పుడు దునియా విజయ్ కూడా భాగం కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ మూవీకి ‘బెగ్గర్’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీతో డిజాస్టర్ అందుకున్న పూరీ జగన్నాథ్ ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టి ఫామ్‌లోకి రావాలని పట్టుదలతో ఉన్నాడు.