బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి(Sudheer Reddy) మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఎస్టీ మహిళా కార్పొరేటర్ సుజాత నాయక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేతలు మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. ఈమేరకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చినట్లు సుధీర్ రెడ్డి చెప్పారు. రాజకీయ కక్షతోనే తనపై ఫిర్యాదు చేశారని మండిపడ్డారు. దీనిపై తప్పకుండా లీగల్ పోరాటం చేస్తానని పేర్కొన్నారు.
కాగా ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని హస్తినాపురం కార్పొరేటర్ బానోత్ సుజాతా నాయక్‌పై అసభ్యకర వ్యాఖ్యలకు చేసినందుకు సుధీర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ కార్పొరేటర్లు మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ళ శారదకు ఫిర్యాదు చేశారు. ఎస్టీ మహిళను కాబట్టే తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని కమిషన్ ముందు సుజాత కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న మహిళా కమిషన్ ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసింది.