Wednesday, April 30, 2025
Homeఆంధ్రప్రదేశ్Revanth Reddy: సింహాచలం ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ దిగ్భ్రాంతి

Revanth Reddy: సింహాచలం ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ దిగ్భ్రాంతి

సింహాచలం ప్రమాద ఘటపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దిగ్భ్రాంతి చెందారు. గోడ కూలి భక్తులు మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని సింహాచలం ఆలయం (Simhachalam Temple) వద్ద గోడ కూలి భక్తులు మరణించిన ఘటన తీవ్ర ఆవేదనను కలిగించిందని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని పేర్కొన్నారు.

- Advertisement -

సింహాచలం ఘటనపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోడ కూలి ప్రాణ నష్టం జరగడం విచారకరమని మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సింహాచలం ప్రమాద ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News