Wednesday, April 30, 2025
Homeఆంధ్రప్రదేశ్YS Sharmila: ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్

YS Sharmila: ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) హౌస్ అరెస్టు అయ్యారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెంలో పర్యటనకు షర్మిల సిద్ధమయ్యారు. పర్యటనకు అనుమతి లేదన్న పోలీసులు ఆమె నివాసం వద్దకు భారీగా చేరుకున్నారు. ఇంటి నుంచి బయటకు రాకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. పోలీసుల తీరుపై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాగైనా ఉద్దండరాయుని పాలెం వెళ్లి తీరుతానని చెబుతున్నారు. దీంతో షర్మిల నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

- Advertisement -

2015లో ప్రధాని మోదీ ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ప్రాంతంలో పర్యటించాలని షర్మిల నిర్ణయించారు. ఆమె పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఇదిలా ఉంటే మే2న రాజధాని అమరావతి నిర్మాణం పనులను పున: ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మురంగా జరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News