ఐసీఎస్‌ఈ(ICSE) 10వ తరగతి, ఐఎస్‌సీ(ISC) 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ ఆఫ్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ బోర్డు (CISCE) ఈ ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను results.cisce.org అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. రోల్ నంబరుతో పాటు క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి ఫలితాలు పొందొచ్చు. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 27 వరకు ఐసీఎస్‌ఈ పదోతరగతి పరీక్షలు జరగ్గా.. ఫిబ్రవరి 13 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు ఐఎస్‌సీ 12వ తరగతి పరీక్షలను నిర్వహించారు.