ఏపీ మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ కుమారుడి వివాహానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) హాజరయ్యారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో విజయవాడ చేరుకున్న ఆయనకు ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్‌రెడ్డి, ఏపీ కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. అనంతరం కృష్ణా జిల్లా కంకిపాడులో జరిగిన వివాహ వేడుకకు మంత్రి నారా లోకేశ్‌తో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, తదితర ప్రముఖులు హాజరయ్యారు.
Revanth Reddy: విజయవాడలో సీఎం రేవంత్ రెడ్డి సందడి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES