తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు(SSC Results) విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రవీంద్రభారతి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఫలితాల్లో మొత్తం 92.78శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇప్పటివరకు సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు సీజీపీఏ ఇచ్చేవారు. ఇక నుంచీ మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారు. విద్యార్థులు ఫలితాలను results.bse.telangana.gov.inలో చెక్ చేసుకోవచ్చు. కాగా రాష్ట్రవ్యాప్తంగా మార్చి 21 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 4న పరీక్షలు జరిగాయి. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.