Saturday, October 5, 2024
HomeతెలంగాణValigonda: ఘనంగా ఉగాది కవి సమ్మేళనం

Valigonda: ఘనంగా ఉగాది కవి సమ్మేళనం

యాదాద్రి జిల్లా వలిగొండ పట్టణ కేంద్రంలోస్థానిక రిటైర్మెంట్ ఉద్యోగుల సంఘ భవనంలో ఘనంగా ఉగాది  కవి సమ్మేళనం నిర్వహించారు.

- Advertisement -

పట్టణ కేంద్రానికి చెందిన ఆత్మీయ భారతి సాహిత్య సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ శోభకృత్ నామ సంవత్సర  ఉగాది పండుగ సందర్భంగా కవి సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాలకుర్ల వెంకటేశం మాట్లాడుతూ.. సాహిత్య పరంగా పల్లె ప్రాంతంలో సాహితీ చైతన్యమును తీసుకురావడానికి చేస్తున్న విశేష సాహిత్య కృషిని అభినందించి, సంస్థ చేసిన, చేస్తున్న కార్యక్రమాలను వారు కొనియాడారు.

రాబోయే తరాల వారికి పండగల ప్రాశస్త్యం, సంస్కృతీ సంప్రదాయాలను ఉనికి కోల్పోయే ప్రమాదమున్నందున సంప్రదాయాలను, అభిరుచులను మన పిల్లలకు తెలియజేయా ల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కురెళ్ళ విఠల్ చార్యులు,పోరెడ్డి రంగన్న వాకిటి రాంరెడ్డి రెబ్బ మల్లికార్జున్, బందారపు లింగస్వామి , ఆలకుంట్ల శ్రీనివాస్, పారుపల్లి మచ్చగిరి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News