తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు(Ramakrishna Rao) బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి నేటితో పదవీ విరమణ చేయడంతో సీఎస్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు. 1991 బ్యాచ్‌కు చెందిన రామకృష్ణారావు గతంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. సుధీర్ఘకాలం ఆర్థిక శాఖలో పనిచేసిన అనుభవం దృష్ట్యా ఆయనను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సీఎస్‌గా నియమించారు. కాగా రామకృష్ణారావు వచ్చే ఆగస్టు నెలలో పదవీ విరమణ చేయనున్నారు.
- Advertisement -
మరోవైపు ఇప్పటివరకు సీఎస్‌గా బాధ్యతలు నిర్వహించిన శాంతికుమారికి ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పజెప్పింది. డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల విభాగం వైస్ ఛైర్మన్, జనరల్ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.