దేశవ్యాప్తంగా కులగణన(Caste Census) చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ(PM Modi), కేంద్ర మంత్రివర్గానికిధన్యవాదాలు తెలిపారు. కేంద్రం నిర్ణయంతో కాంగ్రెస్ అగ్రనాయకులు, లోక్‌సభ పక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) విజన్ సాకారం కాబోతోందని పేర్కొన్నారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
రాహుల్ గాంధీ ప్రతిపక్షంలో ఉండి కూడా కేంద్ర ప్రభుత్వం విధానాలను ప్రభావితం చేశారని కొనియాడారు. దేశంలో కులగణన చేపట్టిన తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించిందని తెలిపారు. రాహుల్ గాంధీ విజన్‌తో రాష్ట్రంలో కులగనణ చేపట్టామని చెప్పారు. కులగణన కోసం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పోరాడిందని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలను భారతదేశం అనుసరిస్తోందని మరోసారి రుజువైందని రేవంత్ రెడ్డి వెల్లడించారు.