రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ఇటీవల నటించిన సినిమాలు ఫ్లాప్‌లు అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘కింగ్‌డమ్’ సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ గుండె చేయించుకుని తన లుక్‌ను పూర్తిగా మార్చేశాడు. ఇప్పటికే ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో విడుదల చేసిన మూవీ గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ప్రోమోని రిలీజ్ చేసారు. అనిరుథ్ సంగీతం అందించిన ఈ ప్రోమోలో ఓ బీచ్ లో కూర్చొని విజయ్ హీరోయిన్ భాగ్యశ్రీకి లిప్ కిస్ ఇచ్చాడు. దీంతో రౌడీ హీరో మళ్లీ ముద్దులతో రెచ్చిపోయాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ‘హృదయం లోపల..’ అంటూ సాగే ఫుల్ సాంగ్ మే 2న రిలీజ్ చేయనున్నారు. కాగా ఈ సినిమాను మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.