ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్(CSK), పంజాబ్ కింగ్స్(PBKS) మధ్య మరికాసేపట్లో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. పాయింట్ల పట్టికలో చెన్నై 10వ స్థానంలో ఉండగా.. పంజాబ్ 5వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి చెన్నై పరువు నిలబెట్టుకోవాలని భావిస్తుండగా.. పంజాబ్ తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని చూస్తోంది.
చెన్నై జట్టు: షేక్ రషీద్, ఆయుష్ మాత్రే, సామ్ కరన్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, దీపక్ హుడా, MS ధోని(C/WK), నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరానా
పంజాబ్ జట్టు: ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్(C), జోష్ ఇంగ్లిస్(WK), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, సూర్యాంశ్ షెడ్జ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్