ఏపీ రాజధాని అమరావతిలో ప్రధాని మోదీ(PM Modi) శుక్రవారం పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం 3.25గంటలకు ప్రధాని అమరావతి చేరుకుంటారు. అనంతరం రాజధాని నిర్మాణ పనులను పున: ప్రారంభిస్తారు. అలాగే రాష్ట్రంలో కేంద్రం చేపట్టనున్న పలు ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు.
- Advertisement -
ప్రధాని పర్యటన నేపథ్యంలో ప్రోటోకాల్ ప్రకారం మాజీ సీఎం జగన్‌ను(Jagan) ఈ కార్యక్రమానికి అధికారులు ఆహ్వానించారు. తాడేపల్లి నివాసంలో జగన్ పీఎస్‌కు ఆహ్వాన పత్రికను అందజేశారు. గతంలో అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆహ్వానించినప్పటికీ జగన్ హాజరు కాలేదు. తాజా ఆహ్వానంపై ఆయన ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.