హైదరాబాద్‌లో మెట్రో(Metro) సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. సాంకేతిక సమస్యల కారణంగా మియాపూర్ నుంచి ఎల్బీనగర్ రూట్‌లో వెళ్తున్న మెట్రో రైలు మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో రైలులో ఉన్న ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. దాదాపు 20 నిమిషాల పాటు భరత్ నగర్‌లోనే రైలు నిలిచిపోయింది.
- Advertisement -
సమాచారం అందుకున్న వెంటనే మెట్రో రైల్ సాంకేతిక సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతు చర్యలు చేపట్టారు. దాదాపు 20 నిమిషాల పాటు శ్రమించి సాంకేతిక సమస్యను పరిష్కరించారు. అనంతరం రైలు యధావిధిగా బయలుదేరి వెళ్లడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.