ఐపీఎల్‌లో భాగంగా మరికాసేపట్లో రాజస్థాన్ రాయల్స్(RR), ముంబై ఇండియన్స్(MI) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో ముంబై రెండో స్థానంలో ఉండగా.. రాజస్థాన్ 8వ స్థానంలో ఉంది. ముంబై గత ఐదు మ్యాచ్‌ల్లో వరుసగా విజయం సాధించి మంచి ఊపు మీద ఉండగా.. రాజస్థాన్ గత మ్యాచ్‌లో విజయంతో ఫామ్‌లోకి వచ్చింది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి ప్లేఆఫ్ రేసులో ముందు ఉండాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.
ముంబై జట్టు: ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా
రాజస్థాన్ జట్టు: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, నితీష్ రాణా, రియాన్ పరాగ్(కెప్టెన్), ధృవ్ జురెల్(వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్, ఫజల్‌హక్ ఫరూఖీ