Sunday, May 4, 2025
Homeచిత్ర ప్రభపెద్దిలో చరణ్-శ్రీలీల మాస్ సాంగ్.. పెద్దే ప్లానింగే ఇది..!

పెద్దిలో చరణ్-శ్రీలీల మాస్ సాంగ్.. పెద్దే ప్లానింగే ఇది..!

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న “పెద్ది” మూవీకి సంబంధించి మరో ఆసక్తికర అప్‌డేట్ ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో మాస్ ప్రేక్షకుల కోసం ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు. ఆ పాటలో చరణ్‌తో కలిసి డ్యాన్స్ చేయించేందుకు శ్రీలీలను తీసుకున్నారట. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాట పూర్తి ఎనర్జిటిక్ మాస్ నంబర్‌గా ఉండబోతుందట. ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్లో ఈ పాటను చిత్రీకరించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయనేది ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది.

- Advertisement -

చరణ్ స్టైల్, శ్రీలీల ఎనర్జీ మిళితమైతే ఈ పాట థియేటర్లలో మాస్ రెస్పాన్స్ తెచ్చే పాటగా నిలుస్తుందంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అంతేకాదు ఈ పాట చరణ్ పాత్రకు కీలకమైన మలుపునివ్వబోతుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక శ్రీలీల ఎంట్రీతో సినిమా హైప్ మరింత పెరిగేలా టీం వ్యూహం రూపొందించిందట.

ఇప్పటికే ఈ మూవీలో జాహ్నవి కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసింది. ఇక ఈ సమయంలో ఈ చిత్రంలో చరణ్-శ్రీలీల కాంబో లో ఓ స్పెషల్ ట్రిట్‌లా ఉండబోతోందని అభిమానులు భావిస్తున్నారు. ఇటీవల పుష్ప 2లో మూవీలో శ్రీలీల చేసిన స్పెషల్ సాంగ్ ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసింది.

ఇదిలా ఉంటే మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 1980 నాటి గ్రామీణ ఆంధ్ర ప్రదేశ్ నేపథ్యంలో నడుస్తోంది. మరి చరణ్ “పెద్ది”గా ఏ రేంజ్ లో దూసుకెళ్లబోతున్నాడో చూడాలంటే మాత్రం అభిమానులు కొద్దిగా వేచి ఉండాల్సిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News