Sunday, May 4, 2025
Homeఇంటర్నేషనల్శ్రీలంకలో పహల్గామ్ అనుమానితులు.. కొలంబోలో తనిఖీలు..!

శ్రీలంకలో పహల్గామ్ అనుమానితులు.. కొలంబోలో తనిఖీలు..!

పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకుల మృతికి కారణమైన ఘటన తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ దాడిలో పాల్గొన్న ఆరుగురు ఉగ్రవాదులు చెన్నై నుంచి విమానంలో ప్రయాణించి శ్రీలంకకు చేరుకున్నట్లు భారత్ నుంచి వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం శ్రీలంకలోని బండారానాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యంత కఠినంగా తనిఖీలు చేపట్టారు.

- Advertisement -

శ్రీలంక ఎయిర్‌లైన్స్‌కు చెందిన UL122 విమానం శనివారం ఉదయం 11.59 గంటలకు చెన్నై నుంచి కొలంబోకు చేరింది. భారత అధికారుల నుంచి ముందస్తు సమాచారాన్ని అందుకున్న శ్రీలంక భద్రతా బలగాలు.. పోలీసు శాఖ, ఎయిర్‌ఫోర్స్, విమానాశ్రయ సిబ్బంది సంయుక్తంగా ఆ విమానంలో గల ప్రయాణికులపై ముమ్మర తనిఖీలు నిర్వహించారు. చెన్నై ఏరియా కంట్రోల్ సెంటర్ ద్వారా లభించిన హెచ్చరికల మేరకు ఈ సెర్చ్ ఆపరేషన్‌ జరిగిందని అధికారులు తెలిపారు.

దాడికి సంబంధించి ఇప్పటి వరకు ప్రధాన అనుమానితుడిగా హషీం ముసా అనే ఉగ్రవాదిని గుర్తించినట్లు తెలుస్తోంది. అతను పాకిస్తాన్ ఆర్మీలో కమాండోగా పనిచేసిన వ్యక్తి అని నిఘా వర్గాల సమాచారం. మతం ప్రాతిపదికన హిందువులే లక్ష్యంగా కాల్పులు జరిపిన ఈ దాడి అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఇక ఈ దాడికి ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ అనే ఉగ్రవాద సంస్థ బాధ్యత తీసుకుంది.

ఈ సంస్థ, పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు అనుబంధంగా పనిచేస్తోందని భద్రతా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశం–పాకిస్తాన్ మధ్య సంబంధాల్లో తిరిగి ఉద్రిక్తతలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తోంది. అయితే శ్రీలంక భద్రతా యంత్రాంగం పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోందని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News