Sunday, May 4, 2025
HomeతెలంగాణRain Alert: హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం

Rain Alert: హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం

తెలంగాణలో భిన్న వాతావరణం నెలకొంది. ఓవైపు ఎండలు దంచికొడుతుంటే.. మరోవైపు వానలు పడుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు(Rain Alert)కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాల్లో తీవ్రమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు.

- Advertisement -

అలాగే హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుందని తెలిపారు. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా బయటకు వెళ్లాలంటే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News