Friday, September 20, 2024
HomeతెలంగాణRamagundam: దండేపల్లి, జన్నారం పోలీస్ స్టేషన్ లను సందర్శించిన పోలీస్ కమిషనర్

Ramagundam: దండేపల్లి, జన్నారం పోలీస్ స్టేషన్ లను సందర్శించిన పోలీస్ కమిషనర్

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల పోలీస్ జోన్ లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు దండేపల్లి, జన్నారం పోలీస్ స్టేషన్ లను రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి, ఐపిఎస్ (డిఐజి), మంచిర్యాల డీసీపీ సుదీర్ రాంనాథ్ కేకన్ ఐపిఎస్., మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డిలతో కలిసి సందర్శించి పోలీస్ స్టేషన్ ల పరిసరాలను, సిబ్బంది పని విధానాలను పరిశీలించారు. స్టేషన్ల సిబ్బందితో మాట్లాడి వారు చేస్తున్న విధుల గురించి, ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకొన్నారు.

- Advertisement -

పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలతో మంచి సత్సంబంధాలు కలిగి ఉండి ఇన్ఫర్మేషన్ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని, పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే నేరాల గురించి అడిగి తెలుసుకొన్నారు.  ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ… రామగుండం కమిషనరేట్లో ఉన్నటువంటి అన్ని పోలీసు స్టేషన్ లను సందర్శించి పోలీసు స్టేషన్లో ఉన్న సమస్యలను తెలుసుకుంటామన్నారు. ఆ పోలీస్ స్తేషన్లో పని చేసినటువంటి అధికారులు, సిబ్బందితో కలిసి మాట్లాడడం వారి సమస్యలు, సంక్షేమం గురించి తెలుసుకోవడం, నూతన పోలీస్ భవనాల నిర్మాణాలు ఉంటే వాటి ప్రస్తుత పరిస్థితి తెలుసుకొని తనిఖీ చేస్తామన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా పొలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న ట్రైబల్ ప్రాంతంలో ప్రజల కోసం కమ్యూనిటి కనెక్ట్ కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులతో చర్చించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News