Sunday, May 4, 2025
Homeనేషనల్రాముడిపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు.. రామ భక్తులు ఆగ్రహం..!

రాముడిపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు.. రామ భక్తులు ఆగ్రహం..!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. రాముడిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. భారతీయులు అత్యంత భక్తితో పూజించే శ్రీరాముడిని పురాణిక దేవతగా వర్ణించిన రాహుల్ గాంధీ మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అమెరికాలోని బ్రౌన్ యూనివర్శిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడిన క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆయన, “రాముడు పౌరాణిక రూపం. ఆయన క్షమాశీలి, దయామయుడు” అంటూ వ్యాఖ్యానించారు.

- Advertisement -

రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు హిందూ భక్తులలో తీవ్ర ఆవేదనకు దారి తీశాయి. దీనిపై భారతీయ జనతా పార్టీ దీనిపై తీవ్రంగా స్పందించింది. ఆ పార్టీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావల్లా, రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ రాముడి ఉనికినే ప్రశ్నిస్తున్నారని, ఇలాంటి మాటలు చెప్పిన వారిని దేశ ప్రజలు ఎప్పటికీ క్షమించరని ఆయన మండిపడ్డారు.

రాహుల్ గాంధీ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వైఖరి ఏమిటో ఇది చూపించే ఉదాహరణగా భావించాలి అని పూనావల్లా అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాముడి పట్ల గౌరవం లేదని, హిందూ సంప్రదాయాలను నిందించడమే ఆ పార్టీ లక్ష్యమైపోయిందని ఆయన ఆరోపించారు. గతంలో రామసేతు వ్యవహారంలో కూడా యుపిఎ ప్రభుత్వం వ్యవహరించిన తీరును గుర్తు చేస్తూ, అప్పుడూ రాముడు కల్పితమైన వ్యక్తి అనే అభిప్రాయాలను వ్యక్తీకరించారని, ఇప్పుడు కూడా అదే ధోరణిని కొనసాగిస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ తరచూ రామ మందిర నిర్మాణానికి వ్యతిరేకంగా మాట్లాడిందని, హిందువుల నమ్మకాలపై దాడి చేస్తూ వచ్చిందని బీజేపీ ఆరోపిస్తోంది. హిందూ ఉగ్రవాదం అనే పదాన్ని ప్రవేశపెట్టిన పార్టీగా కాంగ్రెస్ ఉన్నదని గుర్తు చేస్తూ, ఇది దేశ సంస్కృతి, విశ్వాసాలకు చేసిన నష్టం అని షెహజాద్ పేర్కొన్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ తాజా వ్యాఖ్యలు రామ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మాటలను హిందూ ధర్మాన్ని అవమానించే ప్రయత్నంగా బీజేపీ అంటోంది. రాముడిని అపహాస్యం చేయాలన్నది కాంగ్రెస్ దృక్పథమైపోయిందని, అది దేశ ప్రజల మనోభావాలకు అవమానం కలిగిస్తోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News