Sunday, May 4, 2025
Homeఆటఉత్కంఠభరిత పోరులో ఒక్క పరుగు తేడాతో RRపై KKR విజయం..!

ఉత్కంఠభరిత పోరులో ఒక్క పరుగు తేడాతో RRపై KKR విజయం..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన 53వ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఒక పరుగు తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది. ఈ విజయం ద్వారా కేకేఆర్ తమ ప్లేఆఫ్ ఆశలను బలోపేతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన KKR 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. ఆండ్రీ రస్సెల్ 25 బంతుల్లో 57 పరుగులు చేసి జట్టును మెరుగైన స్థితికి తీసుకెళ్లాడు. అతనికి అజింక్య రహానే (30), అంగ్క్రిష్ రఘువంశీ (44), రింకూ సింగ్ (19 నాటౌట్)ల మద్దతు తోడైంది. ఈ భారీ స్కోరును ఆర్‌ఆర్ ఛేదించే ప్రయత్నంలో దాదాపు విజయానికి చేరువైంది.

- Advertisement -

లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ తరఫున రియాన్ పరాగ్ అద్భుత ఫామ్‌ను ప్రదర్శించాడు. అతను కేవలం 45 బంతుల్లో 95 పరుగులు చేసి దాదాపు ఆ జట్టు విజయం సాధించేలా చేశాడు. మొయిన్ అలీ వేసిన ఓవర్‌లో వరుసగా ఐదు సిక్సులు కొట్టి మ్యాచ్‌ను ఆర్‌ఆర్‌కు అనుకూలంగా మార్చాడు. కానీ ఇతర బ్యాటర్ల నుంచి పెద్దగా మద్దతు లభించకపోవడం, చివరి ఓవర్లలో కేకేఆర్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ వల్ల రాజస్థాన్ రాయల్స్ 205 పరుగులకే పరిమితమైంది.

KKR బౌలర్లలో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ తలో రెండు వికెట్లు తీసి కీలక విజయానికి బాటలేశారు. వారి క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ ఆర్‌ఆర్ ను చివరి దశలో కుదించే పని చేసింది. ఒక్క పరుగు తేడాతో ఈ సీజన్ అత్యంత ఉత్కంఠభరిత గేమ్‌లలో ఒకటిగా నిలిచింది. ఒకవైపు పరాగ్ వీరోచితంగా ఆడినా, మరోవైపు కేకేఆర్ బౌలింగ్ లైనప్ అద్భుతంగా స్పందించి మ్యాచ్‌ను గెలిచింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News