ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ అధినేత ఎల్రెడ్ కుమార్ తన 16వ ప్రాజెక్ట్‌గా ‘మండాడి’ అనే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాను అధికారికంగా ప్రకటించారు. ‘సెల్ఫీ’ సినిమాతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు మతిమారన్ పుగళేంది ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు సూరి ప్రధాన పాత్రలో నటిస్తుండగా, తెలుగులో మంచి గుర్తింపు పొందిన నటుడు సుహాస్ ఈ చిత్రంతో తమిళ సినీరంగంలోకి అడుగుపెడుతున్నారు. కథానాయికగా మహిమా నంబియార్ నటిస్తున్నారు. అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఇటీవల విడుదలైన టైటిల్ పోస్టర్, సూరి ఫస్ట్ లుక్కు మంచి స్పందన లభించింది. తాజాగా, సుహాస్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. లుంగీ ధరించి, జెర్సీ వేసుకుని, “సునామీ రైడర్స్” బృందంతో సముద్రతీరంలో నిలిచిన సుహాస్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. మరో పోస్టర్లో సూరి, సుహాస్ ఇద్దరూ పడవలు నడుపుతూ ఎదురెదురుగా పోటీ పడుతున్న దృశ్యం ఇద్దరి మధ్య తీవ్ర పోరాటాన్ని సూచిస్తోంది. ఈ సినిమాలో సుహాస్ బలమైన ప్రతినాయకుడిగా కనిపించనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్ వంటి సీనియర్ నటులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జీవన పోరాటం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం వంటి భావోద్వేగాల సమ్మేళనంగా సినిమా రూపుదిద్దుకుంటోంది.

సాంకేతికంగా కూడా ఈ ప్రాజెక్ట్ ఎంతో బలంగా తయారవుతోంది. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించగా, ఎస్.ఆర్. కతిర్ ఐ.ఎస్.సి. సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ డి.ఆర్.కె. కిరణ్, ఎడిటింగ్ బాధ్యతలు ప్రదీప్ ఇ. రాఘవ్ చేపట్టగా, యాక్షన్ కొరియోగ్రఫీని పీటర్ హెయిన్ నిర్వహిస్తున్నారు. సౌండ్ డిజైన్ ప్రతాప్, వీఎఫ్ఎక్స్ బాధ్యతలు ఆర్. హరిహర సుతాన్ చూసుకుంటున్నారు. ఈ సినిమా త్వరలోనే చిత్రీకరణ పూర్తి చేసి థియేటర్లలో విడుదల కానుంది.
తారాగణం: సూరి, సుహాస్, మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్,
దర్శకత్వం: మతిమారన్ పుగళేంది, నిర్మాత: ఎల్రెడ్ కుమార్, సహ నిర్మాత: వి. మణికందన్
సాంకేతిక బృందం:
కాస్ట్యూమ్స్ – దినేష్ మనోహరన్
డాన్స్ కొరియోగ్రఫీ – అజర్
రచన – ఆర్. మోహనవసంతన్, తిరల్ శంకర్
మేకప్ – ఎన్. శక్తివేల్
కాస్ట్యూమర్ – నాగు
DI – క్లెమెంట్
పబ్లిసిటీ స్టిల్స్ – కబిలన్
ఫోటోగ్రాఫర్ – జి. ఆనంద్ కుమార్
పబ్లిసిటీ డిజైన్ – ఏస్తెటిక్ కుంజమ్మ
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ – ఎస్.పి. చొక్కలింగం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – జి. మహేష్
PRO – సాయి సతీష్