Monday, May 5, 2025
Homeచిత్ర ప్రభJack OTT: 'జాక్' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Jack OTT: ‘జాక్’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

‘డీజే టిల్లు’ ఫ్రాంచైజీ సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) హీరోగా, దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘జాక్’(Jack)- కొంచెం క్రాక్’. స్పై, యాక్షన్‌ కామెడీ థ్రిల్లర్‌ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ వేసవి కానుకగా ఏప్రిల్‌ 10న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది.

- Advertisement -

మే 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఇది ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈమేరకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా పోస్ట్‌ పెట్టింది.ఇక ఈ చిత్రానికి చాలా రోజుల గ్యాప్ తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు హ్యారీస్ జయరాజ్ సంగీతం అందించడం విశేషం. ఈ సినిమాలో బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య.. సిద్ధు సరసన నటించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News