Monday, May 5, 2025
HomeతెలంగాణRS Praveen Kumar: ఫైనాన్స్ కంపెనీ నడుపుతున్నారా..? సీఎం రేవంత్‌ రెడ్డిపై ఆర్‌ఎస్పీ ఫైర్

RS Praveen Kumar: ఫైనాన్స్ కంపెనీ నడుపుతున్నారా..? సీఎం రేవంత్‌ రెడ్డిపై ఆర్‌ఎస్పీ ఫైర్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? లేదా ఫైనాన్స్ కంపెనీ నడుపుతున్నారా అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) మండిపడ్డారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం పథకానికి సిబిల్ స్కోర్ తప్పనిసరి అనే వార్తలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

- Advertisement -

“90 శాతం రాయితీ, అన్నీ ఉచితమే కానీ నిబంధనలు వర్తిస్తాయి. ఇవి షాపింగ్ మాల్ యాడ్స్ కావు. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ పథకాల పనితీరు. రుణ మాఫీ, రైతు భరోసా, యంగ్ ఇండియా స్కూల్స్, పోలీస్ సంక్షేమ పాఠశాల, రిక్రూట్మెంట్, ప్రజా పాలన, బిల్లుల చెల్లింపులు.. అన్నింటికీ ఏదో ఒక మెలిక. ఎక్కడో ఒక వంక. ఇట్లా ప్రతీ స్కీం ‘కండీషన్స్ అప్లై’ మోడ్ లోనే నడుస్తున్నది రేవంత్ గారు మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? లేక ఫైనాన్స్ కంపెనీ నడుపుతున్నారా?

రాజీవ్ యువ వికాసం పేరుతో, 5 లక్షల మందికి రుణాలు ఇస్తామని చెప్తే.. దాదాపుగా పదహారు లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. మీకు రుణాలు ఇవ్వడం చేతకాకపోతే నేరుగా ఒప్పుకోండి.. అంతేకానీ దరఖాస్తుల సంఖ్య తగ్గించడానికి చిల్లర రాజకీయాలు చేయకండి. అకస్మాత్తుగా సిబిల్ (CIBIL) ఉండాలని షరతులు పెట్టడం ఏంది? సిబిల్ స్కోర్ ఉండాలనే అంశం మీరు ముందు విడుదల చేసిన గైడ్ లైన్స్ లో ఎందుకు పెట్టలేదు? మీరు బ్యాంక్ మేనేజరా? రాష్ట్ర ముఖ్యమంత్రా? చెప్పేదొక్కటి… చేసేదొక్కటా? ఇప్పటివరకు చెప్పింది చెప్పినట్టు ఒక్క పనైనా చేశారా? ప్రతి దానికి ఏదో ఒక మెలిక పెడుతూనే ఉన్నారు. ఎందుకు ఇట్ల రోజూ మోసం చేస్తున్నారు తెలంగాణ ప్రజలను?” అని ఆర్‌ఎస్పీ విరుచుకుపడ్డారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News