టీజీఆర్టీసీ సమ్మె ప్రకటన నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నాయకులపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీల కుట్రలో ఉద్యోగ సంఘాలు పావులుగా మారొద్దని హితవు పలికారు. కొత్త కోరికలతో ధర్నాలు చేస్తే ఉన్న వ్యవస్థ కుప్పకూలుతుందన్నారు. ఉద్యోగ సంఘాలు బాధ్యత మరిస్తే సమాజం సహించదని హెచ్చరించారు. ప్రజలు కష్టాల్లో ఉంటే అండగా ఉండాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాలపై లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర జనాభాలో ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు కలిపితే 2 శాతం మంది ఉంటారని.. మరి 98 శాతం ఉన్న ప్రజలపై మీ యుద్దమా అని మండిపడ్డారు.
ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారిపోయిందన్నారు. తనను కోసినా నెలకు తెలంగాణ ఆదాయం రూ. 18,500 కోట్లే అన్నారు. రూ. 100 పెట్రోల్ రూ.200 చేయమంటారా? రూ. 30 బియ్యం రూ.60 చేద్దామా ? అని ప్రశ్నించారు. 11 శాతం మిత్తికి అప్పు తెచ్చి రాష్ట్రాన్ని దివాళా తీసి కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకున్నారని ఫైర్ అయ్యారు. సమస్య ఉంటే చర్చించుకుందామని ఉగ్యోగ సంఘాలకు సీఎం విజ్ఞప్తి చేశారు.