Tuesday, May 6, 2025
Homeఆంధ్రప్రదేశ్Sujana Chowdary: బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరికి తీవ్ర గాయాలు

Sujana Chowdary: బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరికి తీవ్ర గాయాలు

విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరికి(Sujana Chowdary) తీవ్ర గాయాలయ్యాయి. లండన్ పర్యటనలో ఉన్న ఆయన ఓ షాపింగ్ మాల్‌లో కాలు జారి కిందపడిపోయారు. దీంతో ఆయన భుజానికి తీవ్ర గాయమైంది. స్థానిక ఆసుపత్రిలో చేర్చించగా ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేయాలని సూచించారు. అయితే ఆపరేషన్ కోసం హైదరాబాద్ తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. అభిమానులు ఆందోళన చెందవొద్దని కుటుంబసభ్యులు తెలిపారు. ఆపరేషన్ విజయంతమై ఆయన త్వరగా కోలుకోవాలని కార్యకర్తలు ప్రార్థిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News