ఏపీ లిక్కర్ స్కామ్(AP Liquor Scam) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ 31గా ధనుంజయ రెడ్డి, ఏ 32గా కృష్ణ మోహన్ రెడ్డి, ఏ33గా గోవిందప్ప బాలాజీలను సిట్ అధికారులు చేర్చారు. ఈ ముగ్గురి ఆదేశాలతోనే డబ్బులు వసూలు చేశామని ఇటీవల అరెస్ట్ అయిన కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణక్యలు వాంగ్మూలం ఇచ్చారు. వారి వాంగ్మూలం ఆధారంగా ఇద్దరి రిమాండ్ రిపోర్టులో ముగ్గురి పేర్లను సిట్ చేర్చింది. దీంతో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఏపీ హైకోర్టులోనే ఈ కేసును తేల్చుకోవాలని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. దీంతో ఈ ముగ్గురు పేర్లను నిందితుల జాబితాలో సిట్ అధికారికంగా చేర్చింది. కోర్టుల నుంచి రక్షణ లేకపోవడంతో ఏ క్షణమైనా వీరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరగుతోంది.