దేవాదాయశాఖలో మొత్తం 137 పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఆమోదం తెలిపారు. ఇందులో డిప్యూటీ కమిషనర్, ఈవో గ్రేడ్ 1, గ్రేడ్ 3 స్థాయిల పోస్టులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా 200 మంది వైదిక సిబ్బందిని నియమించేందుకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక 16 ఆలయాల్లో నిత్య అన్నదాన పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.
అలాగే రాష్ట్రంలోని 23 ప్రధాన దేవాలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. ఆలయాల అభివృద్ధిని ఆగమశాస్త్ర ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. ఈమేరకు అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో దేవాదాయ శాఖ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.