ఐపీఎల్‌లో భాగంగా మరికాసేపట్లో ముంబై ఇండియన్స్(MI), గుజరాత్ టైటాన్స్(GT) జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన గుజరాత్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు వరుస విజయాలతో ప్లేఆఫ్స్ రేసులో ఉన్నాయి. పాయింట్ల పట్టికలో ముంబై రెండో స్థానంలో ఉండగా.. గుజరాత్ నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్స్ రేసులో మరింత ముందుకు దూసుకెళ్లాలని భావిస్తున్నారు. దీంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది.
ముంబై జట్టు: ర్యాన్ రికెల్టన్(w), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(C), నమన్ ధీర్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా
గుజరాత్ జట్టు: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(C), జోస్ బట్లర్(w), రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, అర్షద్ ఖాన్, గెరాల్డ్ కోయెట్జీ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ