మిల్క్ బ్యూటీ తమన్నా(Tamannah) అఘోరీగా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఓదెల 2′(Odela 2). ఓదెల రైల్వేస్టేషన్’కు సీక్వెల్గా దర్శకుడు అశోక్ తేజ తెరకెక్కించగా.. డైరెక్టర్ సంపత్ నంది కథ అందించారు. ఏప్రిల్ 17న విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. ఈ మూవీని తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో మే 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. ఈమేరకు ఓ పోస్టర్ విడుదల చేసింది. సినిమా విడుదలైన నెల రోజులు లోపే ఓటీటీలోకి వస్తుండటం గమనార్హం. థియేటర్స్లో మిస్ అయిన వారు ఓటీటీలో చూసేయండి.
‘ఓదెల పార్ట్ 1’ సినిమాలో మరణించిన వ్యక్తి ప్రేతాత్మగా మారి తిరిగి వచ్చి ఆ ఊరిని ఎలాంటి ఇబ్బందులు పెట్టాడు.. తమన్నా అఘోరీగా శివశక్తితో ఆ ప్రేతాత్మని ఎలా ఎదుర్కొంది అనే కథాంశంతో సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ మూవీలో హెబ్బా పటేల్, వశిష్ఠ సింహ, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
