Friday, May 9, 2025
Homeహెల్త్Heart Attack: హార్ట్ ఎటాక్ కి వ్యాక్సిన్.. ఒక్కసారి తీసుకుంటే 8 సంవత్సరాలు సేఫ్..!

Heart Attack: హార్ట్ ఎటాక్ కి వ్యాక్సిన్.. ఒక్కసారి తీసుకుంటే 8 సంవత్సరాలు సేఫ్..!

సాధారణంగా వయసు పెరుగుతున్నక్రమంలో ఆరోగ్య సమస్యలు అందరినీ వేధిస్తుంటాయి. ముఖ్యంగా గుండె జబ్బులు వస్తే.. జీవితానికే ప్రమాదంలో పడినట్టే. అయితే 50 ఏళ్లు పైబడిన వారికి ఇప్పుడు శుభవార్త. షింగిల్స్ వ్యాక్సిన్‌ అనే టీకా వారికి కేవలం వైరస్‌ ఇన్ఫెక్షన్‌ నుంచే కాకుండా గుండె జబ్బుల నుంచి కూడా రక్షణ కలిగిస్తుందని తాజా అధ్యయనం తేల్చింది. ఈ షింగిల్స్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఇది చికెన్‌పాక్స్ వైరస్ అయిన వరిసెల్లా జోస్టర్‌ తిరిగి చురుకుగా మారడం వల్ల వస్తుంది. ఈ వ్యాధి బాధితుడి శరీరంలోని ఒకవైపు దద్దుర్లు, నొప్పులు కలిగిస్తుంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న పెద్దవారికి ఇది ఎక్కువగా వస్తుంది.

- Advertisement -

గుండెకు ఎలా రక్షణ కలుగుతుంది?
ఈ వ్యాధి శరీరంలోని రక్తనాళాలపై ప్రభావం చూపిస్తుంది. వాపు, గడ్డకట్టే అవకాశం పెరిగి గుండెపోటు వంటి సమస్యలకు దారి తీస్తుంది. అయితే షింగిల్స్ వ్యాక్సిన్ తీసుకుంటే ఈ ఇన్ఫెక్షన్ రాకుండా నిరోధించగలుగుతారు. పరోక్షంగా ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అధ్యయనంలో పాల్గొన్న ప్రధాన పరిశోధకుడు ప్రొఫెసర్ డాంగ్ కియోన్ యోన్ వెల్లడించిన వివరాల ప్రకారం .. ఈ టీకా తీసుకున్న వారిలో గుండె జబ్బుల రిస్క్‌ గణనీయంగా తగ్గింది. ఇది ప్రత్యేకంగా 60 ఏళ్లు లోపు వారిలో, ఇంకా హెల్తీ లైఫ్‌స్టైల్ ఫాలో కాకపోయినవారిలో మంచి ప్రభావం చూపించిందని తెలిపారు.

భారతదేశంలో టీకా అందుబాటులో ఉందా?
ప్రపంచవ్యాప్తంగా రెండు రకాల షింగిల్స్ టీకాలు ఉన్నాయి. ఒకటి లైవ్ వెర్సన్ (బలహీనపరిచిన వైరస్‌తో), మరొకటి రీకాంబినెంట్ టెక్నాలజీ ఆధారంగా తయారైంది – ఇది వైరస్‌ను కలిగించకపోయినా రోగనిరోధకతను పెంచుతుంది. ఈ రెండూ ఇప్పుడు భారతదేశంలో కూడా అందుబాటులో ఉన్నాయి. 50 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్కరూ ఈ టీకా వేయించుకోవాలి. ఇది కేవలం షింగిల్స్ నుంచే కాదు, గుండెపోటు వంటి ప్రాణాంతక పరిస్థితులనూ తగ్గించగలదు అని పరిశోధకులు స్పష్టంగా చెప్పారు. గుండె జబ్బుల ప్రమాదం తగ్గించే టీకా ఇదే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జీవితంలో ఆరోగ్యమే ముద్దు అంటే, ఈ షింగిల్స్ వ్యాక్సిన్‌ను మిస్సవ్వకండని సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News