భారత ఆర్మీ వరుస దాడులతో పాకిస్థాన్(Pakistan) ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇప్పటికే ఆ దేశ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. తమను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు సాయం చేయాలని ప్రపంచాన్ని వేడుకుంటోంది. అయితే ఇది ఫేక్ ట్వీట్ అని ఆ దేశం ఫ్యాక్ట్ చెక్ విభాగం ప్రకటించడం గమనార్హం.
అసలు ఆ పోస్టులో ఏముందంటే.. భారత్ ఆకస్మిక దాడులతో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైందంటూ ప్రపంచ బ్యాంక్‌ను ట్యాగ్ చేస్తూ పాక్ ఆర్థిక వ్యవహరాల విభాగం ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. భారత్‌తో పెట్టుకుని తాము అన్ని విధాలుగా నష్టపోయామని తెలిపింది. యుద్ధం తీవ్రతరం అవుతోందని.. తమ వద్ద ఉన్న నిల్వలు అడుగంటాయని అని వాపోయింది. ప్రపంచబ్యాంకుతో పాటు అంతర్జాతీయ భాగస్వాములు తమకు సహకారం అందజేయాలని విజ్ఞప్తి చేసింది. కాగా కరోనా, రాజకీయ సంక్షోభాలు, ఉగ్రవాదానికి మద్దతు నేపథ్యంలో ఆ దేశం ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది.