టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) సైతం టెస్టులకు రిటైర్మెంట్ తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయాన్ని బీసీసీఐకి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో బోర్డు పెద్దలు షాక్ అయ్యారట. జూన్ నెలలో ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఇంగ్లాండ్ టూర్ వెళ్లనుంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత జట్టు కెప్టెన్‌గా ఎవరినీ నియమించాలనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యంగా కేఎల్ రాహుల్, శుభమన్ గిల్, రిషభ్ పంత్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ఇలాంటి సమయంలో ఇంగ్లాండ్ టూర్‌కు ముందే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తానని బీసీసీఐకి కోహ్లీ సమాచారం ఇచ్చారట. అయితే తన నిర్ణయాన్ని పున:పరిశీలించాలని బోర్డు అధికారి ఒకరు కోహ్లీకి విజ్ఞప్తి చేశారట. రోహిత్‌తో పాటు కోహ్లీ కూడా లేకపోతే జట్టు ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని.. ఇంగ్లాండ్ లాంటి పటిష్ట జట్టును అనుభవలేమి భారత జట్టు ఎలా ఎదుర్కొంటుందని వివరించారట. కానీ కోహ్లీ నుంచి స్పందన రాలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంగ్లాండ్ పర్యటనకు సెలక్షన్ కమిటీ త్వరలోనే జట్టును ప్రకటించాల్సి ఉంది. మరి కోహ్లీ రిటైర్మెంట్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి నెలకొంది.