Saturday, May 10, 2025
Homeకెరీర్Bank Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. SBIలో 3,323 పోస్టులు

Bank Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. SBIలో 3,323 పోస్టులు

ప్రభుత్వ రంగానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI Jobs) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 3,323 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు పోటీపడే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ కలిగి ఉండాలి. అయితే అభ్యర్థుల వయసు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

- Advertisement -

ఆన్‌లైన్ పరీక్ష, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ, స్థానిక భాషా ప్రావీణ్య పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ఇతర అలవెన్సులతో పాటు రూ. 48,480 ప్రారంభ వేతనం పొందుతారు. దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ రూ. 750 చెల్లించాలి. SC/ST/PwBD వారికి ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఆసక్తి గల వారు మే 29వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు SBI అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News