Saturday, May 10, 2025
Homeఇంటర్నేషనల్Pakistan: భారత్ దెబ్బకు కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్థాన్

Pakistan: భారత్ దెబ్బకు కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్థాన్

పహల్గామ్‌ దాడికి ప్రతీకారం భారత్‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌'(Operation Sindoor)పేరుతో పాకిస్థాన్‌పై భీకర దాడులకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌ తమపై దాడి చేస్తే ఎదురుదాడికి దిగుతామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన పాక్‌.. ఇండియన్ ఆర్మీ దాడులను తట్టుకోలేక కాళ్లబేరానికి వచ్చింది. ఈ క్రమంలో ఆ దేశ ఉప ప్రధాని, విదేశాంగమంత్రి ఇషాక్‌ దార్(Ishaq Dar) భారత్‌ ముందు ఓ కీలక ప్రతిపాదన పెట్టారు. తమ దేశంపై భారత్ దాడులు ఆపితే.. తాము కూడా ఆపుతాం అని రాజీకి వచ్చారు. ఇదే విషయాన్ని అమెరికాకు కూడా స్పష్టం చేశామని వెల్లడించారు.

- Advertisement -

ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నడుమ పాక్ ఆర్మీ చీఫ్‌కు ఆమెరికా విదేశాంగ మంత్రి రుబియా ఫోన్‌ చేసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో పాక్‌ విదేశాంగశాఖ మంత్రి ఇలాంటి ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పాక్ వక్రబుద్ధి నేపథ్యంలో సరిహద్దుల్లో కాల్పులును కొనసాగిస్తుందా.? లేక ఆపుతుందా..? అని తేలాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News