వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి విడదల రజని(Vidadala Rajini) ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా పోస్టుకు సంబంధించి ఆమె కారులో ఉన్న శ్రీకాంత్‌ను తీసుకెళ్లడానికి పోలీసులు యత్నించారు. దీంతో పోలీసులకు, రజనికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో చెప్పాలని ఆమె పోలీసులను కోరారు. ఈ క్రమంలో రజినీని సీఐ సుబ్బారాయుడు పక్కకు నెట్టి కారు ఎక్కిన వీడియో వైరల్ అవుతోంది. దీనిపై వైసీపీ తీవ్రంగా మండిపడింది. మహిళలపై పోలీసులు ఇలాగేనా ప్రవర్తించేదని.. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ సీఎం చంద్రబాబును ప్రశ్నించింది.
ఇక ఇప్పటికే విడదల రజనిపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేశారని ఆమెపై అభియోగాలు ఉన్నాయి. ఇదే కేసులో ఆమె మరిది గోపీని అధికారులు అరెస్టు చేశారు.