భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) సీజన్ వారం రోజుల పాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే మిగిలిన మ్యాచ్‌లను త్వరగా ప్రారంభించేందుకు బీసీసీఐ(BCCI) ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా సౌత్ ఇండియాలోని మూడు నగరాల్లో మ్యాచ్‌ల నిర్వహణకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
క్రికెట్ వర్గాల కథనం ప్రకారం.. ఐపీఎల్ 18వ సీజన్‌లో మిగిలిన 16 మ్యాచ్‌లను దక్షిణాది రాష్ట్రాల్లోని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో నిర్వహించేందుకు బీసీసీఐ పరిశీలిస్తోంది. ఈ మూడు నగరాలు అయితే పాక్ సరిహద్దులకు దూరంగా ఉండటంతో సేఫ్ అని భావిస్తుందట. ఈమేరకు ఫ్రాంచైజీలకు సమాచారం అందించినట్లు సమాచారం. కాగా ఈ సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లకు గాను ఇప్పటివరకు 58 మ్యాచ్‌లు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం 12 లీగ్ మ్యాచ్‌లు, నాలుగు ప్లేఆఫ్ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. పాత షెడ్యూల్ ప్రకారం మే 25న ఫైనల్ జరగాల్సి ఉంది.