భారత్- పాకిస్తాన్ దేశాల(India-Pakistan War)మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య నెలకొన్న యుద్ధాన్ని ఆపేందుకు అమెరికాతో సహా జీ7 దేశాలు ముందుకొచ్చాయి. ఇప్పటికే అమెరికా విదేశాంగ కార్యదర్శి రూబియో భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శులతో చర్చించారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన ప్రకటన చేశారు. కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయని స్వయంగా తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
రెండు దేశాల మధ్య అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని.. తమ ప్రతిపాదనలను రెండు దేశాలు గౌరవించాయని పేర్కొన్నారు. తక్షణమే సీజ్‌ఫైర్‌కు భారత్-పాక్ అంగీకరించాయని స్పష్టం చేశారు. దీంతో రెండు దేశాలకు ట్రంప్ అభినందనలతో యుద్ధం ఆపడానికి సహకరించినందుకు కృతజ్ఞతలు చెప్పారు.