Monday, May 12, 2025
Homeచిత్ర ప్రభNTR: ఎన్టీఆర్‌కు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

NTR: ఎన్టీఆర్‌కు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడు సినిమాల్లోకి రానున్నాడు. దివంగత హరికృష్ణ మనవడు, జానకీ రామ్‌ కుమారుడు తారక రామారావు (Nandamuri Taraka Ramarao) హీరోగా ప్రముఖ దర్శకుడు వైవీఎస్‌.చౌదరి (YVS Chowdary) కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నారు. నేడు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌లో పూజాకార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. హీరోహీరోయిన్లపై ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి క్లాప్‌ కొట్టి అభినందించారు. ఇక ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

- Advertisement -

‘న్యూ టాలెంట్‌ రోర్స్‌’ పతాకంపై ఆయన సతీమణి గీత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించనున్నారు. ఈ సినిమాతో హైందవ సంస్కృతి, తెలుగు భాష గొప్పతనం గురించి ప్రేక్షకులకు చెప్పనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో తెలుగు అమ్మాయి వీణారావు నటిస్తున్నారు.

స్వర్గీయ శ్రీ జానకిరామ్ గారి కుమారుడు నందమూరి తారక రామారావు సినిమాల్లోకి అడుగుపెడుతున్న సందర్భంగా సీఎం చంద్రబాబు హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు. ఆయన తొలి చిత్రం గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇక సీనియర్‌ ఎన్టీఆర్‌ ఎంత కీర్తి తెచ్చుకున్నారో ఈ తారక రామారావు కూడా అలానే ఎదగాలని కోరుకుంటున్నానని భువనేశ్వరి తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News