Friday, September 20, 2024
HomeదైవంSrisailam: పంచాంగ శ్రవణం

Srisailam: పంచాంగ శ్రవణం

శ్రీశైలంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమములో దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి బుట్టే వీరభద్ర దైవజ్ఞ పంచాంగ శ్రవణం చేశారు. ముందుగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు సంకల్పం పఠించి లోక క్షేమం కోసం శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు విశేష పూజలు నిర్వహించారు. తరువాత ఆస్థాన సిద్ధాంతి శోభకృత్ నామ సంవత్సర విశేషాలను వివరించారు.

- Advertisement -

సిద్ధాంతి బుట్టే వీరభద్ర దైవజ్ఞ పంచాంగ శ్రవణంలో భాగంగా..ఈ సంవత్సరం దేశమంతటా బాగా వర్షాలు.. కురుస్తాయని వర్షపాతం నమోదు సగటు కంటే ఎక్కువగా ఉందన్నారు. దేశంలోని నదులున్నీ పొంగి ప్రవహిస్తాయని వరి, గోధుమలు, చెరుకు, ధాన్యములు, మిర్చికి రైతులకు మంచి ధరలు ఉంటాయని ఔషధ, వాణిజ్య పంటలకు మంచి దిగుబడి ఉంటుందన్నారు. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి బాగా పెరుగుతుందని పాడిపరిశ్రమ అభివృద్ధి ఉందని, వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అలానే ఈ ఏడాది భారతదేశ ఖ్యాతి పెరుగుతుందని, అంతరిక్ష పరిశోధనలు విజయం సాధిస్తాయన్నారు. క్రీడారంగంలో విజయాలు, ద్రవ్యోల్బణం తగ్గుతుందని, పారిశ్రామిక రంగం వృద్ధిలో ఉంటుందని పర్యాటక రంగం కూడా అభివృద్ధిపరంగా రాణిస్తుందన్నారు. ఈ పంచాంగ శ్రవణం అనంతరం ఆస్థాన సిద్ధాంతికి శేష వస్త్రాలు,శ్రీస్వామి అమ్మవారి ప్రసాదాలు ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో ఎస్.లవన్న దంపతులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News