భారత వాయుసేన తన శక్తిని మరోసారి రుజువు చేసింది. “ఆపరేషన్ సిందూర్” సందర్భంగా భారత రక్షణ వ్యవస్థ ఎలా పని చేసిందో, పాక్ ఎయిర్ ఫోర్స్ ఎలా ఓటమిపాలైందో భారత వాయుసేన అధికారి అవధేష్ కుమార్ భారతి ఇవాళ విలేకరుల సమావేశంలో వివరించారు. అయన చెప్పిన వివరాల ప్రకారం “భారతదేశానికి ఉన్న వాయు రక్షణ వ్యవస్థ చాలా బలంగా ఉందని తెలిపారు. పాకిస్తాన్ ఆధునిక PL15 E క్షిపణులతో దాడి చేయబోయింది. కానీ అవి మన రక్షణ వ్యవస్థను దాటలేకపోయాయని తెలిపారు. మన లేజర్ గన్‌లు పాక్ పంపిన డ్రోన్‌లన్నింటినీ ఆకాశంలోనే కూల్చేశాయని పేర్కొన్నారు.
ఇక మన దాడిపై మాట్లాడుతూ భారతదేశం వదలకుండా కౌంటర్ దాడులు చేసిందని పేర్కొన్నారు. మే 7న పాక్‌లోని ఉగ్రవాదుల రహస్య స్థావరాలపై మన ఎయిర్ ఫోర్స్ దాడులు చేసిందని పేర్కొన్నారు. ఈ దాడిలో నూర్ యార్, రహీమ్ యార్ ఖాన్ ఎయిర్ బేస్‌లు పూర్తిగా నాశనం అయ్యాయన్నారు. రహీమ్ యార్ ఖాన్ వద్ద పెద్ద బొంబాయి పేలుడు సంభవించి అక్కడ భారీ గోతిని ఏర్పరిచిందన్నారు.
ఇది ఉగ్రవాదంపై పోరాటం అని DGMO లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో పహల్గామ్ వంటి ప్రదేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువయ్యాయి. అందుకే ముందు జాగ్రత్తగా మన వాయు రక్షణ వ్యవస్థలను సిద్ధం చేసుకున్నామని తెలిపారు. పాక్ ఎయిర్ ఫోర్స్ అనేకసార్లు దాడి చేయాలని చూసినా, ఒక్కటైనా విజయవంతం కాలేదన్నారు. ఎయిర్ మార్షల్ ఎకె భారతి మాట్లాడుతూ .. మన సైనిక స్థావరాలన్నీ సురక్షితంగా ఉన్నాయన్నారు. భవిష్యత్తులో మరో మిషన్ అవసరమైతే, మనం పూర్తిగా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
ఈ ప్రకటనలతో పాకిస్తాన్‌కు స్పష్టమైన సందేశం వెళ్లిందని విశ్లేషకులు చెబుతున్నారు భారత్ సైనికంగా మరింతగా బలపడింది, దేశ భద్రతపై ఏమాత్రం రాజీ పడదని ఈ ఆపరేషన్ ద్వారా మరోసారి చూపించగలిగిందన్నారు.