కింగ్ అక్కినేని నాగార్జున(Nagarjuna) ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయంలో సందడి చేశారు. తన లైసెన్స్ రెన్యూవల్ కోసం రవాణాశాఖ కార్యాలయానికి వచ్చారు. ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం లైసెన్స్ రెన్యూవల్ దరఖాస్తులపై సంతకం చేసి ఫొటో దిగారు. ఈ సందర్భంగా సిబ్బంది ఆయనతో సెల్ఫీలు దిగారు. అనంతరం నాగార్జున తన కారులో వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Nagarjuna: ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయంలో నాగార్జున సందడి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES