భారత్- పాకిస్థాన్‌ల మధ్య మే 10న కాల్పుల విరమణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు జరిగిన డీజీఎంవోల(DGMO) చర్చలు ముగిశాయి. హాట్‌లైన్ ద్వారా జరిగిన ఈ చర్చల్లో భారత డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాకిస్థాన్ డీజీఎంవో మేజర్ జనరల్ కాశిఫ్ చౌదరి పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకే చర్చలు జరగాల్సి ఉండగా.. సాయంత్రానికి వాయిదా పడ్డాయి. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతల తగ్గింపు, పీవోకే తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం.
కాగా పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో పాక్ కూడా భారత్ సరిహద్దు ప్రాంతాలపై డ్రోన్లు, మిస్సైల్ దాడికి పాల్పడింది. దీంతో ఇరుదేశాల మధ్య యుద్దం వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణకు భారత్-పాక్ అంగీకరించాయి. ఈ నేపథ్యంలో మిలిటరీ ఆపరేషన్స్‌పై రెండు దేశాల మధ్య శాంతి చర్చలు కొనసాగాయి.