భారత్-పాక్ ఉద్రిక్తతలు, కాల్పుల విరమణ నేపథ్యంలో సోమవారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ(PM Modi) కీలక ప్రసంగం చేసిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదం వదలకపోతే పాకిస్తాన్ దేశాన్ని అంతం చేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో పంజాబ్‌లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌ను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా వైమానిక దళ అధికారులు, సైనికులతో సరదాగా ముచ్చటించారు. ఇటీవల విజయవంతంగా నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’పై సాయుధ బలగాలను ప్రధాని అభినందించారు. కాగా మే 9, 10 తేదీలలో పాకిస్థాన్ దాడికి యత్నించిన భారత వైమానిక కేంద్రాలలో ఆదంపూర్ స్థావరం కూడా ఒకటి కావడం గమనార్హం.


‘ఆదంపుర్ ఎయిర్‌బేస్‌కు వెళ్లి మన పోరాటయోధులను కలిశాను. ధైర్యం, దృఢ సంకల్పానికి ప్రతిరూపంగా నిలిచేవారితో మాట్లాడటం ఒక ప్రత్యేక అనుభవం. మన దేశ రక్షణ కోసం బలగాలు చేసే ప్రతిచర్యకు ప్రజలందరూ ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటారు. భారత్ మాతాకీ జై’’ అని ఎక్స్ వేదికగా మోదీ రాసుకొచ్చారు.
