ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ వేదికగా జూన్ 11 నుంచి 15 మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఫైనల్‌లో పాల్గొనబోయే ఆసీస్ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. హేజిల్‌వుడ్, కామెరూన్ గ్రీన్ తిరిగి జట్టులోకి వచ్చారు. ఇక బ్రెండన్ డగెట్ ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపికయ్యాడు. కాగా 2023-25 WTCలో దక్షిణాఫ్రికా 12 టెస్టుల్లో 8 విజయాలతో 69.44 పాయింట్లతో అగ్రస్థానంలో, ఆస్ట్రేలియా 19 మ్యాచ్‌ల్లో 13 విజయాలతో 67.54 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి తుది పోరుకు అర్హత సాధించాయి.
ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్‌స్టాస్, మ్యాట్ కునెమన్, మార్నస్ లబుషేన్, నాథన్ లైయన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్. ట్రావెలింగ్ రిజర్వ్: బ్రెండన్ డగెట్