భారత ప్రధాన న్యాయమూర్తి(CJI) జస్టిస్ సంజీవ్ ఖన్నా(Justice Sanjiv Khanna) పదవీ విరమణ చేశారు. సుప్రీంకోర్టు 51వ సీజేఐగా 2024 నవంబర్ 11న బాధ్యతలు స్వీకరించిన ఆయన నేటితో పదవీ కాలం ముగియడంతో రిటైర్ అయ్యారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా తన పదవీ కాలంలో ఎన్నికల బాండ్ల స్కీమ్‌ను రద్దు చేయడం, ఆర్టికల్ 370 రద్దును సమర్థించడం, ఎన్నికల్లో ఈవీఎంల వాడకాన్ని సమర్థించడం వంటి కీలక తీర్పులలో భాగమయ్యారు. క్రిమినల్ కేసుల నిర్వహణను మెరుగుపరచడానికి ఈమెయిల్/రాతపూర్వక వినతులను ప్రోత్సహించడం వంటి సంస్కరణలను ప్రవేశపెట్టారు. కాగా సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్(Justice BR Gavai) బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ఏడాది నవంబర్ 23 వరకు సీజేఐగా ఆయన కొనసాగనున్నారు.