Saturday, May 17, 2025
Homeనేషనల్BSF Jawan: బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ను భారత్‌కు అప్పగించిన పాక్‌

BSF Jawan: బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ను భారత్‌కు అప్పగించిన పాక్‌

పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఫిరోజ్‌పూర్ సెక్టార్‌లో విధులు నిర్వహిస్తున్న బీఎస్‌ఎఫ్‌ జవాన్(BSF Jawan) పూర్ణమ్ కుమార్ షా(Purnam Kumar Sha) పొరపాటున పాక్ భూభాగంలోకి ప్రవేశించాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న పాక్ రేంజర్లు ఎట్టకేలకు ఇవాళ విడుదల చేశారు. పంజాబ్‌లోని అటారీ సరిహద్దు వద్ద భారత దళాలకు అప్పగించారు. అయితే దీనిని బీఎస్‌ఎఫ్‌ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

- Advertisement -

పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్‌ సెక్టార్‌లో విధులు నిర్వర్తిస్తున్న పూర్ణమ్.. ఏప్రిల్‌ 23న సరిహద్దు గస్తీ కాస్తుండగా కాస్త అస్వస్థతకు గురయ్యారు. సమీపంలో ఓ చెట్టు కనబడటంతో దాని కింద విశ్రాంతి తీసుకున్నారు. అయితే అది పాక్‌ భూభాగం కావడంతో పాకిస్థాన్‌ రేంజర్స్‌ అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అతడిని విడిపించేందుకు భారత్ అధికారులు పాక్‌తో సంప్రదింపులు జరిపారు. మరోవైపు గర్భిణి అయిన పూర్ణమ్ భార్య.. భర్త విడుదల కోసం కేంద్రాన్ని వేడుకున్నారు. ఇదిలా ఉండగానే ఇటీవల భారత దళాలు కూడా పాక్‌ రేంజర్‌ను అదుపులోకి తీసుకొన్నారు. దీంతో పాక్‌పై ఒత్తిడి పెరిగి పూర్ణమ్‌ను సురక్షితంగా భారత్‌కు అప్పగించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News